బేబీ ఫుడ్స్ నుంచి డ్రింక్స్ వరకు అన్నీ విషపూరితమే..అక్కడ కొంటే అంతే సంగతి.. !
X
కిరాణా వస్తువుల నుంచి బ్యూటీ వస్తువులు వరకు, బేబీ ఫుడ్స్ నుంచి స్వీట్స్ వరకు, న్యాప్‌కిన్లు, వంటనూనె, బిస్కెట్లు, బిళ్లలు, లేస్, బూస్ట్, మీకేం కావలన్నా అక్కడే తక్కువ ధరకే లభిస్తాయి. వస్తువు ఏదైనా మిగతవారి కంటే తగ్గింపు ధరలకే విక్రయిస్తారు. దీంతో ఆ షాపుకు వినియోగదారులు క్యూ కడతారు. చాలా తక్కవకే వచ్చిందని ఇన్నిరోజులు సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి ఆందోళనకు గురవుతన్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెంగళూరులోని శ్యామ్ పురా మెయిన్ రోడ్డులో పాషా అనే వ్యక్తి కొన్ని రోజులుగా ఓ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ కొన్ని వస్తువలను తక్కువ ధరకే అమ్మేవాడు. తక్కువ ధరలపై వినియోగదారుడిని అడగ్గా గోదాము నుంచి సామాగ్రిని తెప్పించి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి నమ్మించే వాడు. కానీ అతడు కాలం చెల్లిన వస్తువులను అమ్ముతున్నట్లు ఇటీవల బయట పడింది. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పక్కా సమాచారం ఆధారంగా బెంగళూరులోని సీసీబీ పోలీసులు పాషా షాపు మీద దాడులు చేశారు. రూ. 50 లక్షల విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. దుకాణంలో అమ్మకానికి పాషా అక్రమంగా బాల కార్మికులను కూడా విధుల్లో చేర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. పాషా షాపులో చిన్నారులు, పిల్లల ఉత్పత్తులు కూడా కాలం చెల్లినవిగా తేల్చారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని గోదాములో గడువు ముగిసిన సామాన్లను పాషా నిర్ణీత ధర కంటే 10% తక్కువకు కొనుగోలు చేసి అమ్మేవాడని పోలీసుల విచారణలో తేలింది. అతను షాపు నుంచి వేరే దుకాణాలకు కూడా సరఫరా చేసినట్టు పోలీసులు వివరించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి విచారణ నిర్వహించనున్నట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
ఏ వస్తువు కొనుగోలు చేస్తున్నా ముందుగా ఎక్స్పైర్ డేట్ చూసుకోవాలి. ఆ వస్తువు కాలపరిమితి ఎంత వరకు ఉన్నదో చెక్ చేసిన తర్వాతే ఆహార పదార్థాలు, డ్రింక్స్ కొనుగోలు చేయాలి. తేదీ దాటిన వాటిని తినడం ఆరోగ్యానికే పెను ప్రమాదం. కొన్ని సార్లు అవి విషపూరితం అయి ప్రాణాల మీదకి రావొచ్చు.