Home > క్రైమ్ > తిరుమల వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తిరుమల వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తిరుమల వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
X

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా విజయవాడ వాసులుగా తెలిసింది. . గాయపడ్డ వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగం కారణమని తెలుస్తుంది. అతివేగంగా వచ్చిన కారు ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద లారీని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 9 July 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top