భార్యకు భయపడి తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లినే కసాయిలా కడతేర్చాడు ఓ కొడుకు. 80 ఏళ్ల పండు ముసలి అని కూడా చూడకుండా ఊర్లోని ఓ నీటి కుంటలో తల్లిని తోసేసి ఆమెను అంతమొందించాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కొడుకును కటకటాల పాలు చేసింది.
బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరులో శ్రీనివాసరావు తన తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే పళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్తా కోడళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ మధ్యనే శ్రీనివాసరావు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. అయినప్పటికీ ఇంట్లో పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. తన తల్లి ఇంట్లోకి వస్తే భర్య వెళ్లిపోతాననడంతో శ్రీనివాసరావుకు ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లి అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు. ఊరు చివరకు తీసుకెళ్లి అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని కన్న తల్లి అని కూడా చూడకుండా మానవత్వాన్ని మరచి ఆమెను కుంటలో తోసి చంపాడు. అనంతరం ఏమీ జరగలేదన్నట్టు ఇంటికి వచ్చేశాడు. తెల్లవారుజామున సంఘటన జరిగిన చోట ముసలావిడ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొడుకు శ్రీనివాసరావే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.