Home > క్రైమ్ > హైదరాబాద్‌లో మరో కల్తీ దందా.. బిస్కెట్లని కూడా..

హైదరాబాద్‌లో మరో కల్తీ దందా.. బిస్కెట్లని కూడా..

హైదరాబాద్‌లో మరో కల్తీ దందా.. బిస్కెట్లని కూడా..
X

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా .. హైదరాబాద్‌లో పలు రకాల ఆహారపదార్థాలను కల్తీ చేస్తూనే ఉన్నారు. ఇంట్లో ఉపయోగించే నిత్యావసర సరుకులతో పాటు ఆహార పదార్థాలు, చిరు తిండ్లను కూడా కల్తీ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు దుర్మార్గులు. ఐస్‌క్రీం, కేక్‌లు, చాక్లెట్లు, స్వీట్స్‌ను కల్తీ చేస్తోన్న గ్యాంగ్‌లను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఇతర వ్యక్తుల సమాచారంతో ఆకస్మికంగా కల్తీ పదార్థాలు తయారుచేస్తున్న స్థావరాలపై దాడులు చేపడుతున్నారు. ఈ దాడుల్లో కల్తీ దందా బాగోతాలు వెలుగులోకి వస్తోన్నాయి.

కల్తీ దందాలపై అధికారులు ఎప్పడికప్పుడు కొరడా ఝుళిపిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట కల్తీ పరిశ్రమలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నాసిరకం వస్తులతో బిస్కట్లను తాయరు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని అల్లాపూర్‌లో కల్తీ బిస్కట్ పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ బృందం దాడులు నిర్వహించింది. నాసిరకమైన వస్తువులతో బిస్కట్లు తయ్యారి చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ బిస్కట్ల తయారీతో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.

రిశ్రమలో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, పరిసరాల్లో దర్వాసన వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపి వివిధ ప్లేవర్స్ బిస్కట్ తయారీకి కంత్రీగాళ్లు తెరలేపారు. పరిశ్రమలలో ఫుడ్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కనిపించని పరిస్థితి. దీంతో భారీగా కల్తీ బిస్కట్స్‌లను ఎస్వోటీ బృందం చేసింది. కల్తీ బిస్కట్ పరిశ్రమ నడుపుతున్న షేక్ ఖదీర్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. భాగ్యనగరం కల్తీ పదార్థాలకు అడ్డాగా మారిపోతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు తలెత్తుతున్నాయి.

Updated : 19 Jun 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top