Home > క్రైమ్ > ప్రొఫెసర్​‌నే బ్లాక్ మెయిల్ చేసిన స్టూడెంట్.. ఎందుకంటే..

ప్రొఫెసర్​‌నే బ్లాక్ మెయిల్ చేసిన స్టూడెంట్.. ఎందుకంటే..

ప్రొఫెసర్​‌నే బ్లాక్ మెయిల్ చేసిన స్టూడెంట్.. ఎందుకంటే..

ప్రొఫెసర్​‌నే బ్లాక్ మెయిల్ చేసిన స్టూడెంట్.. ఎందుకంటే..
X



చదువు చెప్పిన ఓ మహిళ ప్రొఫెసర్​ను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశాడో విద్యార్థి. ప్రొఫెసర్​ను బెదిరించి న్యూడ్ వీడియో తీసి, రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మహరాష్ట్రలోని ఓ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది.

మహిళ ప్రొఫెసర్​ ఆ యూనివర్శిటీలో పాఠాలు బోధించే సమయంలో.. బీహార్‌కు చెందిన మయాంక్ సింగ్(26) అనే విద్యార్థి, మారుపేరుతో ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఆమె​తో చాటింగ్ చేసేవాడు. ఆ తరువాత డైరెక్ట్​గా ఫోన్​, వాట్సాప్​ కాల్​ చేయడం ప్రారంభించాడు. సడెన్​గా ఒకరోజు ప్రొఫెసర్​కు వీడియో కాల్​ చేసి.. తాను చెప్పినట్లు చేయాలని ఆమెను బెదిరించాడు. లేకపోతే వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా యూనివర్సిటీలో బయటపెడతానని హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన ప్రొఫెసర్​.. నిందితుడు చెప్పినట్లు చేసింది. ఆ తర్వాత ఆ వీడియోను ఆమెతో పాటు ఆమె భర్తకు పంపించి వారి నుంచి రూ. 4లక్షలను డిమాండ్ చేశాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

"ప్రొఫెసర్​కు వీడియో కాల్​ చేసిన నిందితుడు.. ఆమె శరీరంపై బట్టలను తీసేయాలని బెదిరించాడు. అతడు చెప్పినట్లు చేయకపోతే ఎక్కడ పరువు తీస్తాడన్న భయంతో.. నిందితుడు చెప్పినట్లే ఆమె చేసింది. ఆ దృశ్యాలను రికార్డ్​ చేసిన నిందితుడు.. అనంతరం బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భార్యభర్తలిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై వారికి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం" అని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.




Updated : 25 Jun 2023 8:48 AM IST
Tags:    
Next Story
Share it
Top