ఎంత దారుణం: అమ్మాయి వాటర్ బాటిల్లో మూత్రం.. చర్య తీసుకోవాల్సిన పోలీసులు కూడా..
X
ఓ అనాగరిక ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. తోటి అమ్మాయి వాటర్ బాటిల్ లో మూత్రం పోశారు క్లాస్ మెట్స్. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోలేదు కదా.. పైగా వాళ్లపైనే తిరిగి కేసు నమోదు చేసే పనిలో పడ్డారు. లుహారియా గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగిందీ ఘటన. అదే స్కూల్ కు చెందిన కొందరు పిల్లలు తమ క్లాస్ మెట్ వాటర్ బాటిల్ మూత్రం పోశారు. అంతేకాకుండా తన బ్యాగ్ లో ‘LOVE U’ అని రాసి లెటర్ పెట్టారు. బాటిల్ లో మూత్రం పోసిన విషయం తెలియక ఆ అమ్మాయి.. నీళ్లు తాగింది. దాంతో దుర్వాసన రావడంతో ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది.
దీనిపై ప్రిన్సిపల్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకుని ఆగ్రహించిన తల్లిదండ్రులు.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అయినా ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో.. తప్పు చేసిన విద్యార్థుల ఇళ్లపై దాడికి దిగారు. నిందితుల ఇళ్లపై రాళ్లదాడి చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విద్యార్థుల ఇళ్లపై రాళ్ల దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.