Suchana Seth : బ్యాగ్‌లో కొడుకు మృతదేహం..500 కి.మీ ప్రయాణం.. చివరకుఏమైందంటే?
X
కన్న బిడ్డను కంటి రెప్పల కాపాడుకోవాల్సిన తల్లే కర్కశ మనసుతో కడతేర్చింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని ట్యాక్సీలో బెంగళూరుకు బయలుదేరింది. గోవా పోలీసుల సమాచారం మేరకు కర్ణాటక పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని. బ్యాగు నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే.. బెంగళూరు స్టార్టప్ కంపెనీ సీఈఓ సుచనా సేథ్ తన కుమారుడితో కలిసి గోవాకు హాలీడ్ ట్రిప్ కోసం వచ్చింది. ట్రిప్‌లో భాగంగా గోవాలోని సోల్ బన్యన్ గ్రాండ్ హోటల్ బస చేసింది. సోమవారం హోటల్ గదిని వెళ్ళిపోయింది. అనంతరం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేస్తున్న సమయంలో వారికి రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సిబ్బంది హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించగా... వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీని తనిఖీ చేయగా, అందులో తన కొడుకుతో కలిసి హోటల్‌కు వచ్చిన ఆమె... చెక్ అవుట్ సమయంలో ఒంటరిగా వెళ్ళిపోయింది. దీంతో గోవా పోలీసులు హోటల్ సిబ్బందిని విచారించగా .. ఆ మహిళ తన గది నుండి ఒంటరిగా బయటకు వచ్చి బెంగళూరుకు టాక్సీ బుక్ చేయమని కోరిందని వారు పోలీసులకు వివరించారు. క్యాబ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని.. విమానంలో బెంగళూరు వెళ్లాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. అయితే, ఆమె ట్యాక్సులోనే వెళ్లాలని పట్టుబట్టిందని.. దీంతో తాము ట్యాక్సీని బుక్ చేసినట్లు వెల్లడించారు.
దీంతో గోవా పోలీసులు టాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. గోవా పోలీసుల సమాచారంతో టాక్సీ డ్రైవర్ కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. వెంటనే పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకుని
బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని స్వాదినం చేసుకున్నారు.
ఈ హత్య ఉదంతంపై ప్రాధమిక విచారణ జరిపిన పోలీసులు పలు కీలక విసయాలు వెల్లడించారు. 2010లో సుచన సేథ్‌కి కేరళకు చెందిన వెంకట్ రామన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వెంకట్ రామన్ AI డెవలపర్. 2019లో వీరికి ఒక మగబిడ్డ పుట్టింది. అయితే, 2020లో వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు వీరికి విడాకులు మంజూరు చేసిన కోర్టు భర్త వెంకట్ రామన్ బిడ్డను ప్రతి ఆదివారం కలుసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. అయితే, సుచనకు తన భర్త తన కొడుకును కలవడం ఇష్టం లేదు. దీంతో కొడుకును హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు