అమెరికన్ హాట్ మోడల్.. గంజాయితో దొరకడంతో అరెస్ట్
X
విహారయాత్ర కోసమని స్నేహితురాలితో కలసి ఐలాండ్స్‌కు వెళ్లాలనుకున్న ఓ అమెరికన్ హాట్ మోడల్ అడ్డంగా బుక్ అయింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల గంజాయి పట్టుబడి.. చివరకు కోర్టు మెట్లు ఎక్కింది. అమెరికాకు చెందిన సూపర్ మోడల్ జిగి హడిద్ (Gigi Hadid).. తన స్నేహితురాలు నికోల్ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి యూకేలోని కైమన్ ద్వీపానికి (Cayman Islands) వెళ్లాలనుకుంది. ఇందుకోసం సామాన్లు అంతా సర్దుకొని.. ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ ద్వీపానికి బయల్దేరింది కూడా. కానీ మధ్యలో ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు గంజాయితో పట్టుబడింది. అధికారులు తనిఖీ చేయగా ఆమె వద్ద గంజాయి (Ganja), దానిని తాగడానికి ఉపయోగించే వస్తువులు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
తాము చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో జడ్జి.. వారికి వెయ్యి డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్ సూపర్ మోడల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.