Home > క్రైమ్ > మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
X

హైదరాబాద్లో విషాదం జరిగింది. మాదాపుర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతిని కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగం కోసం నాలుగు నెలల క్రితం ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి కేబుల్ బ్రిడ్జి చూడడానికి వెళ్లింది. బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఒక్కసారిగా పైనుంచి చెరువులోకి దూకేసింది.

ఆమెను ఫ్రెండ్స్ అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తన ప్రేమను యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated : 13 July 2023 8:03 PM IST
Tags:    
Next Story
Share it
Top