Home > క్రైమ్ > రైల్వే బ్రిడ్జిపై సెల్ఫీలు.. ట్రైన్ ఢీకొని టీనేజర్ల దుర్మరణం

రైల్వే బ్రిడ్జిపై సెల్ఫీలు.. ట్రైన్ ఢీకొని టీనేజర్ల దుర్మరణం

రైల్వే బ్రిడ్జిపై సెల్ఫీలు.. ట్రైన్ ఢీకొని టీనేజర్ల దుర్మరణం
X

సెల్ఫీ మోజులో ఇద్దరు టీనేజర్ల ప్రాణాలు తీసింది. రైల్వే బ్రిడ్జిపై సెల్ఫీలు దిగుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతికి అందివచ్చిన కొడుకులు విగతజీవులుగా మారడం చూసి వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

రూర్కీ పట్టణానికి చెందిన సిద్ధార్థ్‌ సైనీ (19), శివం సైనీ (16) కుటుంబసభ్యులతో కలిసి లక్సర్‌ ప్రాంతంలోని సోలానీ నదీ తీరానికి వచ్చారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఇద్దరు టీనేజర్లు దగ్గరలోని దోస్నీ రైల్వే బ్రిడ్జిపైకి చేరుకున్నారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా డెహ్రాడూన్‌ - ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ దూసుకొచ్చింది. రైలు వస్తున్న విషయాన్ని ఇద్దరూ గమనించకపోవడంతో ట్రైన్ వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సిద్ధార్థ్, శివం స్పాట్ లోనే చనిపోయారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 26 Jun 2023 10:21 PM IST
Tags:    
Next Story
Share it
Top