Home > క్రైమ్ > విమానాల్లో వెళ్లి దొంగతనాలు..కేరళలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్

విమానాల్లో వెళ్లి దొంగతనాలు..కేరళలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్

విమానాల్లో వెళ్లి దొంగతనాలు..కేరళలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్
X

అతనో దొంగ.. మామూలు దొంగ కాదు హై ప్రొఫైల్ దొంగ. పక్క రాష్ట్రాలే అతడి టార్గెట్. అందుకోసం ఏకంగా విమానాల్లో వెళ్తాడు. తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. కేవలం బంగారం మాత్రమే దొంగతన చేస్తాడు. ఆ బంగారాన్ని కూడా అక్కడే తాకట్టు పెట్టి.. డబ్బుతో తిరిగి సొంతూరికి వస్తాడు. ఈ హైటెక్ దొంగను కేరళ పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కేరళలోని తిరువనంతపురంలో ఇటీవల మూడు వరుస దొంగతనాలు జరిగాయి. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్‌ ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా తెలంగాణకు చెందిన శంకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత రెండు నెలల్లో శంకర్ నాలుగు సార్లు విమానంలో కేరళకు వచ్చినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మొత్తం మూడు చోరీలు చేసినట్లు చెప్పారు.

‘‘ శంకర్ జూన్‌లో ఓ ఆటో రిక్షాలో తిరువనంతరపురం సిటీ మొత్తం రెక్కీ నిర్వహించాడు. పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. రాత్రిపూట గూగుల్ మ్యాప్ ఉపయోగించి తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడతాడు. కేవలం బంగారం మాత్రమే చోరీ చేస్తాడు. ఆ తర్వాత బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు’’ అని పోలీసులు తెలిపారు. శంకర్పై గతంలో కూడా చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వివరించారు.



Updated : 5 July 2023 10:38 PM IST
Tags:    
Next Story
Share it
Top