Home > క్రైమ్ > ఫోన్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. ఇంటి ఓనర్ రావడంతో..

ఫోన్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. ఇంటి ఓనర్ రావడంతో..

ఫోన్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. ఇంటి ఓనర్ రావడంతో..
X

సంగారెడ్డి : పటాన్ చెరులో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళం పగులగొట్టి దోపిడీకి ప్రయత్నించారు. ఇంతలో ఇంటి యజమాని రావడంతో ఫోన్ వదిలి పరారయ్యారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పటాన్ చెరు పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో కమాలొద్దిన్ నివాసం ఉంటున్నాడు. తండ్రిని చూసేందుకు వెళ్లిన ఆయన అర్థరాత్రి సమయంలో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి యజమాని కమాలొద్దిన్ వచ్చిన విషయం గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. తాళం పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూసిన కమాలొద్దిన్ కు దొంగలుపడ్డ విషయం అర్థమైంది. వెంటనే బయటకు వచ్చి పారిపోతున్న దొంగలను వెంబడించాడు. అయితే వారు పారిపోవడంతో ఇంటికి వచ్చి చూడగా ఓ దొంగ చెప్పులతో పాటు ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ కనిపించింది.

కమాలొద్దిన్ ఇంటి నుంచి దొంగలు 12 తులాల బంగారం, 60తులాల వెండి, రూ.24వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Updated : 9 Jun 2023 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top