ఏపీలో మరో టమాటా రైతు దారుణ హత్య
X
టామాటా పంట వేసిన కొందరు రైతులు ఒక్కరోజులోనే కోటీశ్వరులు అవుతుంటే మరికొందరు దారుణ హత్యలకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లిన వాళ్లు పొలాల్లోనే కడతేరిపోతున్నారు. అన్నమయ్య జిల్లాలో మరో టామాటా రైతును దొంగలు కిరాతకంగా చంపేశారు. ఐదు రోజుల కిందట ఇదే జిల్లాలో టామాటా రైతు హత్యకు గురయ్యాడు. తాజాగా పెద్దతిప్పసముద్రం మండలంలో ఘోరం జరిగింది. నవాబుకోటకు చెందిన బత్తల మధుకర్ రెడ్డి టమోటా పంట పండిస్తున్నాడు. కేజీ ధర రూ. 150 వరకు చేరడంతో దొంగలు ఎత్తుకుపోతారని ఆదివారం రాత్రి పొలంలో గుడారం వేసుకుని నిద్రపోయాడు. ఉదయం విగతజీవిగా కనిపించాడు. అతని మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. టామాటా దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, మధుకర్‌కు ఎవరితోనూ గొడవలు లేవని చెబుతున్నారు.
గత బుధవారం మదనపల్లె మండలం బోడిమల్లదిన్నె గ్రామానికి చెందిన టామాట నరెం రాజశేఖర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. అతడు ఇటీవలే టామాలు అమ్మి రూ.30 లక్షలు సంపాదించాడు. టమాటాలు కావాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవల అతణ్ని సంప్రదించారు. డబ్బు కోసమే అతణ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ధరలను కొండెక్కడంతో దేశవ్యాప్తంగా టమాటాలు దొంగతనాలు, దోపిడీలు పెరిపోతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా పొలాలకు పోలీసుల కాపలా పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.