Home > క్రైమ్ > బెడిసి కొట్టినప్రేమ.. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం..

బెడిసి కొట్టినప్రేమ.. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం..

బెడిసి కొట్టినప్రేమ.. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం..
X

అబ్బాయిలు అమ్మాయిలను వేధించడం తరుచూ వింటుంటాం. అబ్బాయిల వేధింపులతో అమ్మాయిలు సూసైడ్ వరకు వెళ్లడం కూడా చూశాం. కానీ ఎన్టీఆర్ జిల్లాలో రివర్స్ జరిగింది. అమ్మాయి వేధింపులు తాళలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేటకు చెందిన మనోహర్కు ఫేస్బుక్ ద్వారా ప్రియాంక అనే యువతి పరిచయం అయ్యింది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే కొన్నాళ్లకు అమ్మాయి ప్రవర్తన నచ్చక మనోహర్ ఆమెను దూరంపెట్టాడు. దీంతో వ్యవహారం పెద్దలదాక వెళ్లగా.. యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. లేకపోతే 20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇచ్చేందుకు మనోహర్ నిరాకరించడంతో యువతి కేసు పెట్టింది.

యువతి కేసుతో మనోహర్ జైలుకు వెళ్లాడు. అతడు జైలు నుంచి వచ్చాక కూడా ప్రియాంక వేధింపులు ఆగలేదని.. అతడి అన్న నరేష్పై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో యువతి వేధింపులు తాళలేక అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనోహర్ పరిస్థితి నిలకడగా ఉండగా.. నరేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రియాంక మాత్రం తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 5 Aug 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top