Home > క్రైమ్ > నిజామాబాద్లో అక్కాచెల్లెళ్ల దారుణ హత్య..

నిజామాబాద్లో అక్కాచెల్లెళ్ల దారుణ హత్య..

నిజామాబాద్లో అక్కాచెల్లెళ్ల దారుణ హత్య..
X

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో దారుణం జరిగింది. వృద్ధ అక్కాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయత్‌ నగర్‌లో అక్కాచెల్లెళ్లు మగ్గిడి రాజవ్వ(72), గంగవ్వ(62) గత కొంతకాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరి తలలపై కొట్టి చంపారు.

అనంతరం మృతదేహాలకు నిప్పు పెట్టి పరారయ్యారు. బుధవారం ఉదయం పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యలపై ఆరా తీశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated : 19 July 2023 1:55 PM IST
Tags:    
Next Story
Share it
Top