Home > క్రైమ్ > SBI ఏటీఎంలో చోరీ.. డబ్బులొదిలేసి ACతో పరార్

SBI ఏటీఎంలో చోరీ.. డబ్బులొదిలేసి ACతో పరార్

SBI ఏటీఎంలో చోరీ.. డబ్బులొదిలేసి ACతో పరార్
X

పంజాబ్​లోని మోగా జిల్లాలో ఉన్న ఎస్​బీఐ ఏటీఎంలో డబ్బుకు బదులు.. ఏసీ ని దోచుకెళ్లారు ఇద్దరు దొంగలు. ఈ వింత చోరీ ఘటనపై బ్యాంకు మేనేజర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని బాఘ్​ పట్టణంలోని ఎస్​బీఐ బ్యాంక్​ ఏటీఎంలో ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం.. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఏటీఎంలోకి ప్రవేశించారు. అందులో ఒకడు.. అక్కడే డస్ట్​ బిన్​ను తిరుగవేసి పైకి ఎక్కాడు. ఇండోర్​ ఏసీ యూనిట్​ వైర్​లను కత్తిరించేశాడు. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఏసీ మెషిన్​ను ఇద్దరు కలిసి దోచుకెళ్లిపోయారు. చోరీకి సంబంధించిన మొత్తం దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

అయితే చోరీ ఘటనపై బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. గతంలో కూడా బ్యాంకుకు చెందిన మోటారు సైకిల్ కూడా చోరీకి గురైన సమయంలోనూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో ఏటీఎం మెషిన్​ బద్దలు కాలేదని ఏకంగా మెషిన్​నే ఎత్తుకెళ్లారు. వీరు మాత్రం డబ్బుకు బదులుగా ఏసీని దోచుకెళ్లారు.

Updated : 16 July 2023 11:35 AM IST
Tags:    
Next Story
Share it
Top