Home > క్రైమ్ > హాస్పిటల్లో బాలిక మృతి.. శవాన్ని బైక్పై కూర్చోబెట్టి డాక్టర్ పరార్..

హాస్పిటల్లో బాలిక మృతి.. శవాన్ని బైక్పై కూర్చోబెట్టి డాక్టర్ పరార్..

హాస్పిటల్లో బాలిక మృతి.. శవాన్ని బైక్పై కూర్చోబెట్టి డాక్టర్ పరార్..
X

ఉత్తర్ ప్రదేశ్లో అమానుష ఘటన జరిగింది. ఓ డాక్టర్ చేసిన తప్పుకు నిండు ప్రాణం బలైంది. అనారోగ్యంతో ఉన్న బాలికకు సదరు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో అమ్మాయి శవాన్ని క్లినిక్ బయట పార్క్ చేసిన బైక్పై కూర్చోబెట్టి పారిపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యూపీలోని గిరోర్ ప్రాంతానికి చెందిన భారతి అనే అమ్మాయి కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. మంగళవారం జ్వరం తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు ఆమెను కర్హాల్ రోడ్లోని రాధా స్వామి హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఆమె ఆరోగ్యపరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే అదే రోజు డాక్టర్ ఓ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అమ్మాయి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో డాక్టర్ పేషెంట్ భారతిని వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. కాసేపటికి ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చనిపోయింది.

భారతి చనిపోయిన విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పని డాక్టర్ ఓ దారుణానికి పాల్పడ్డాడు. పేషెంట్ డెడ్ బాడీని హాస్పిటల్ బయట పార్క్ చేసిన టూ వీలర్పై కూర్చొబెట్టి స్టాఫ్ తో కలిసి పరారయ్యాడు.

మృతురాలి బంధువులు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడం వల్లే భారతి చనిపోయిందని ఆరోపించారు. హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్నారు. భారతి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు డాక్టర్ నిర్వాకం గురించి తెలుసుకున్న డిస్ట్రిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణ చేపట్టగా హాస్పిటల్లో వైద్యుడిగా ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి అసలు డాక్టర్ కాదని తేలింది. దీంతో ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు అందులో చికిత్స పొందుతున్న మరో రోగిని దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర రిపోర్టు ఇవ్వాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులను సీఎంఓ ఆదేశించింది.


Updated : 29 Sept 2023 9:34 PM IST
Tags:    
Next Story
Share it
Top