Home > క్రైమ్ > భర్తను చంపిన భార్య .. అంతకుముందు గూగుల్లో ఏమని సెర్చ్ చేసిందంటే..?

భర్తను చంపిన భార్య .. అంతకుముందు గూగుల్లో ఏమని సెర్చ్ చేసిందంటే..?

భర్తను చంపిన భార్య .. అంతకుముందు గూగుల్లో ఏమని సెర్చ్ చేసిందంటే..?
X

కౌరీ రిచిన్స్.. తన భర్త అకస్మాత్తుగా చనిపోయాక ఓ పుస్తకం రాసింది. తన భర్త మరణం తర్వాత తాము అనుభవించిన వేదన, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆర్ యూ విత్ మి అనే పుస్తకం రాసినట్లు అప్పట్లో ఆమె చెప్పింది. అయితే పోలీసులు తన భర్తను ఆమె చంపింది అని చెప్పడంతో అంతా షాకయ్యారు. మద్యంలో డ్రగ్స్ కలిసి ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది.

కౌరీ రిచిన్స్ భర్త హత్యకు ముందు ధనవంతుల కోసం లగ్జరీ జైళ్లు, బీమా కంపెనీలు పరిహారం చెల్లించడానికి ఎంత సమయం పడుతుంది అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీటితో పాటు డిలీట్ చేసిన సందేశాలను పరిశోధకులు చూడగలరా.. లై డిటెక్టర్ పరీక్ష చేయమని పోలీసులు మనల్ని బలవంతం చేయగలరా.. డెత్ సర్టిఫికెట్పై మరణానికి గల కారణాన్ని మార్చవచ్చా? అని ఆమె వెబ్లో సెర్చ్ చేశారు.

ఆమె కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా ఈ వివరాలు బయటకొచ్చాయి. కౌరీని సమాజానికి తీవ్రమైన ప్రమాదంగా పేర్కొన్న న్యాయమూర్తి.. ఆమె జైల్లో ఉండాల్సిందేనని తీర్పిచ్చారు. కాగా 2022 మార్చిలో ఓ రోజు అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ వచ్చింది. తన భర్త ఎరిక్ రిచిన్స్ అపస్మారకంగా పడి ఉన్నాడని కౌరీ రిచన్స్ ఆ ఫోన్ చేశారు. తన భర్తకు మద్యం ఇచ్చానని.. ఆ తర్వాత నుంచి ఆయన స్పందించడం లేదని చెప్పింది. హెల్త్ సిబ్బంది వెళ్లి చెక్ చేసి అతడు మరణించినట్లు తెలిపారు. అయితే తన భర్తను కౌరీ రిచన్స్ చంపారని కొన్నాళ్లకు పోలీసులు గుర్తించారు.

Updated : 13 Jun 2023 5:02 PM IST
Tags:    
Next Story
Share it
Top