Home > క్రైమ్ > ‘ఆమె’ సినిమాలో కోట శ్రీనివాసరావును చంపినట్లు చంపిన అత్త

‘ఆమె’ సినిమాలో కోట శ్రీనివాసరావును చంపినట్లు చంపిన అత్త

‘ఆమె’ సినిమాలో కోట శ్రీనివాసరావును చంపినట్లు చంపిన అత్త
X

ఈవీవీ సత్యనారాయణ తీసిన ‘ఆమె’ చిత్రం అప్పట్లో బంపర్ హిట్. ఆడవాళ్ల సెంటిమెంట్ కథతో, మహా బరువైన డైలాగులతో నడిచే ఆ చిత్రంలోని కథ వాస్తవ జీవితంలో ఉండేదే. సినిమా చివరలో కోడలిపై అత్యాచారం చేయబోతున్న మామను అతని భార్యే కత్తితో ఘోరంగా చంపేస్తుంది. మామగా కోట శ్రీనివాసరావు, అతని భార్యగా సుధ, కోడలిగా ఊహ చక్కగా నటించారు ఆ చిత్రంలో. సుధ.. కోటను చంపుతూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆనాడు ద్రౌపది, సీతలు తమ భర్తలకు ఎదురు తిరిగి ఉంటే ఈనాడు స్త్రీలకు దుర్గతి పట్టేది కాదని భారీ డైలాగులు వల్లించి కోటను కత్తిపీటతో నరికి చంపుతుంది సుధ. అలాంటి ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కోడలిని లైంగిక వేధిస్తున్న మామను అతని భార్యే గొంతు కోసి చంపింది.

బదాయూ జిల్లాలోని బిస్టీ ప్రాంతంలో ఈ సంఘన జరిగింది. తేజేంద్ర సింగ్‌ అనే వ్యక్తి ఈనె 14న హత్యకు గురయ్యాడు. పోలీసులు అతని కుటుంబ సభ్యులను విచారించగా, ఎవరో వచ్చి చంపేసి పోయారని చెప్పారు. అయితే భార్య మిథిలేశ్‌ దేవి కాస్త తడబడుతూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట బుకాయించినా, తర్వాత హత్య తనే చేశానని ఒప్పుకుంది. కోడలిని కాపాడుకోవడానికి గత్యంతరం లేని పరిస్థితితో ఆ ఘోరం చేయక తప్పలేదని వెల్లడించింది. భర్త తేజేంద్ర సొంత కోడలిపైనే కన్నేసి వేధించేవాడని, తన కోరిక తీర్చడానికి సహకరించమని తనను బలవంతం చేసేవాడని మిథిలేశ్ తెలిపింది. ఈ నెల 14న అతడు పూటుగా మందుకొట్టి అల్లరి చేసి, ఇంటి బయట పడుకున్నాడని, తను కొడవలితో గొంతు కోసి చంపేశానని అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేజేంద్ర, మిథిలేశ్ లకు నలుగురు పిల్లలు.

Updated : 26 Aug 2023 5:34 PM IST
Tags:    
Next Story
Share it
Top