టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వాట్ నెక్స్ట్?
X
గత కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. రోజు రోజుకు సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో పరిచయాలున్న పలువురి సెలబ్రిటీల పేర్లు ఒక్కొక్కటిగా లిస్టులో చేరుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఇద్దరు యంగ్ హీరోలపేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కొకైన్ రవాణా చేస్తుండగా ఈ నెల 14న కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అతని ఫోన్లలో వందల కొద్దీ ఫొటోలు, ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించారు. అతని ఫోన్లో తెలుగు సహా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రధానంగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపిన ప్రకారంగా చౌదరీ 12 మందితో ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపులు, 11 అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపైనే ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఈ కేసుపై కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా రెస్పిండ్ అయ్యారు. బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి తనపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోలపై మరో నటి స్పందించింది. అవి తన పర్సనల్ ఫోటోలని అవసరమైతే ఈ కేసులో పోలీసులకు సహకరిస్తానని క్లారిటీ ఇచ్చింది.
కేపీ చౌదరి తన ఫ్రెండ్స్‌తో కలిసి మేలో హైదరాబాద్ స్నేహితహిల్స్‌లోని సిక్కిరెడ్డి ఇంట్లో పార్టీ చేసుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. దీనిపై సిక్కిరెడ్డి భర్త బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమిత్ మీడియా ద్వారా స్పందించారు. కేపీ చౌదరి తెలిసిన వ్యక్తి కావటంతో నాలుగురోజుల పాటు ఉండేందుకు తమ ఫ్లాట్‌ను ఇచ్చామని తెలిపారు. స్పోర్ట్స్ పర్సన్‌గా తామెంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తామని అన్నారు. ఈ కేసులో కేపీచౌదరి లిస్టులో ఉన్నవారిలో ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారు.. ఇంకెంతమంది కొకైన్ విక్రయిస్తున్నారు అనే విషయంపై స్పష్టత వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని తెలుస్తోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.