Home > క్రైమ్ > రియల్ లైఫ్‎లో దృశ్యం సినిమా..కానీ ట్విస్ట్ అదిరిందిగా..

రియల్ లైఫ్‎లో దృశ్యం సినిమా..కానీ ట్విస్ట్ అదిరిందిగా..

రియల్ లైఫ్‎లో దృశ్యం సినిమా..కానీ ట్విస్ట్ అదిరిందిగా..
X

తెలుగులో వెంకటేశ్, మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.తన కూతురిని రక్షించుకునేందుకు హీరో రకరకాల ప్లాన్లు వేసి పోలీసులను బోల్తా కొట్టిస్తాడు.గుట్టు బయట పడకుండా తన ఫ్యామిలీకి సపోర్ట్‎గా నిలుస్తాడు హీరో.తెలుగు, మలయాళం వర్షన్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి రీసెంట్‎గానే హిందీ పరిశ్రమ కూడా దృశ్యం సినిమాను తీసింది. అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఇన్స్పిరేషన్‎గా తీసుకుని గుజరాత్‌ కు చెందిన ఓ మహిళ తాను చేసిన హత్య నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడి కోసం ఏకంగా తన కడుపున పుట్టిన రెండున్నరేళ్ల కొడుకును దారుణంగా హతమార్చింది. దృశ్యం సినిమా కాబట్టి హీరో తప్పించుకున్నాడు . కానీ ఇది రియల్ లైఫ్ అందుకే చేసిన తప్పుకు పోలీసులకు దొరికిపోయి మహిళ కటకటాల పాలైంది

సూరత్‌కు సమీపంలోని దిండోలి గ్రామంలో కూలీగా పని చేస్తోంది మాండవి అనే వివాహిత మహిళ. ఆమెకు రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఈ మహిళ ఝార్ఖండ్‎కు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో కలిసి జీవించాలనుకుంది. కానీ, కొడుకు అడ్డుగా ఉన్నాడు. కొడుకును తనతోపాటే తీసుకువస్తానంటే ప్రియుడు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా తన కొడుకు అడ్డు తొలగించాలనుకుని ముక్కుపచ్చలారని ఆ బాబును దారుణంగా చంపి అతడి మృతదేహాన్ని ఓ నిర్మాణ స్థలంలో టాయిలెట్ కోసం తవ్విన గోతిలో విసిరేసింది. మాండవి భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. విచారణలో మాండవి తన కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారని రకరకాల కథలు చెప్పింది. కానీ పోలీసులకు అనుమానం రావడంతో కాస్త ఒత్తిడి చేయగానే అసలు విషయాన్ని బయటపెట్టింది. తన కొడుకును తానే చంపినట్లు ఒప్పుకుంది.

మొదట మాండవి తన కొడుకు మృతదేహాన్ని చెరువులో పడేశానని పోలీసులకు చెప్పింది. కానీ ఆ చెరువులో ఎంత వెతికినా వీర్ బాడీ లభించలేదు. తర్వాత ఓ గొయ్యి తీసి పూడ్చేశానని చెప్పింది. అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరకు నిర్మాణంలో ఉన్న ఇంటి బాత్రూమ్ గోతిలో పూడ్చేశానని నిజం ఒప్పుకుంది. పోలీసులకు ఓ క్రైం థ్రిల్లర్ సినిమాను చూపించింది. అంతే కాదు కొడుకును హత్య చేసే ముందు చాలా సార్లు దృశ్యం సినిమా చూశానని, ఆ సినిమా స్ఫూర్తితోనే బాబును బాత్రూమ్ గోతిలో పూడ్చానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ తరువాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 3 July 2023 9:21 PM IST
Tags:    
Next Story
Share it
Top