Home > క్రైమ్ > ప్రియుడు పట్టించుకోలేదని ఆ ప్రియురాలు ఏం చేసిందంటే..

ప్రియుడు పట్టించుకోలేదని ఆ ప్రియురాలు ఏం చేసిందంటే..

ప్రియుడు పట్టించుకోలేదని ఆ ప్రియురాలు ఏం చేసిందంటే..
X

వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలు దారితీస్తున్నాయి. తన ప్రియుడు తనని మోసం చేశాడని.. 11 ఏళ్ల బాలుడిని అతి కిరాతంగా హత్య చేసింది ఓ యువతి. ఈ దారుణ సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ ఢిల్లీకి చెందిన పూజ కుమారి(24) అనే యువతికి 2019లో జితేంద్ర అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. నిజానికి.. జితేంద్రకు అంతకుముందే పెళ్లయ్యింది. అతనికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల భార్యకు దూరంగా ఉంటున్న జితేంద్ర.. మూడేళ్లుగా పూజతో సహజీవనం చేస్తున్నాడు. ఇక ఇటీవల తన భార్య, కొడుకు వద్దకు వెళిపోయాడు జితేంద్ర.

పూజా కుమారికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ప్రియుడు తనని మోసం చేసి వెళ్లిపోయాడని.. జితేంద్రపై కోపం పెంచుకుంది. జితేంద్ర స్నేహితుల ద్వారా అతను ఉంటున్న అడ్రస్ తెలుసుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు-10 న ఇందర్‌పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లింది. ఇంట్లో జితేంద్ర కుమారుడు దివ్యాంష్ (11) మాత్రమే ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే సరైన సమయం అనుకుని ఆ బాలుడిని అతి కిరాతంగా హత్య చేసి పక్కనే ఉన్న బట్టలు పెట్టెలో మతదేహాన్ని పెట్టి పరారైంది. ఇక హత్య విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఈ హత్య చేసింది పూజానే అని నిర్ధారించి, ఆమె ఎక్కడుందో జల్లెడ పట్టి, మూడు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Updated : 16 Aug 2023 2:28 PM IST
Tags:    
Next Story
Share it
Top