భర్త ఇంటికి రావట్లేదని క్షుద్ర పూజలు.. భార్య అరెస్ట్?
X
భర్త ఇంటికి రాకపోతే ఏ భార్య అయినా.. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడించో లేదంటే పీఎస్ లో ఫిర్యాదు చేసో ఎలాగోలా భర్తను ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా ఒక మహిళ తన భర్త ఇంటికి రావడంలేదని విచిత్రమైన పనిచేసింది. ఓ బాబాను కలిసి తన భర్తకు ఇంటికి రావాలంటే పరిష్కార మార్గం చెప్పాలని కోరింది. అతడు తనకు తోచిన ఉపాయమేదో చెప్పగా.. దానిని తూచా తప్పకుండా ఫాలో అయ్యేందుకు ప్రయత్నించి చివరకు ఫెయిలైంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కంచన్ బాగ్ హఫీజ్ నగర్ ప్రాంతంలో స్థానిక మహిళ తన భర్త ఇంటికి రావట్లేదని క్షుద్ర పూజలు చేసింది. తమ నివాస ప్రాంతంలో ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో( క్షుద్ర పూజలకు ఉపయోగించే సమాన్లు ) ఒక చిన్న తెల్లటి కవర్‌లో మూట కట్టి గోయ్యిలో పూడ్చి పెట్టిప్రయత్నం చేయగా.. అది గమనించిన అక్కడి స్థానికులు ఆమెను ప్రశ్నించారు. వెంటనే బిత్తరపోయిన సదరు మహిళ చేతిలో ఉన్న కవరుతో మెల్లగా అక్కడి నుంచి జారుకుంది.
కాగా ఈ తతంగం అంతా ఒకరు వీడియో తీశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఈ వ్యవహారంపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తన భర్త మీద ఎంత ప్రేమ ఉంటే ఈవిధంగా చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్షుద్ర పూజలపై సదరు మహిళను, ఆమెకు సలహా ఇచ్చిన ఆ బాబాను స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ - కంచన్ బాగ్లోని హఫీజ్ నగర్లో భర్త ఇంటికి రావట్లేదని క్షుద్ర పూజలు చేసిన భార్య.. భార్య హజీరా, బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/ctpJ44julh
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2023