Home > క్రైమ్ > నీచుడు.. బుర్కా ధరించి ఏం చేశాడంటే..

నీచుడు.. బుర్కా ధరించి ఏం చేశాడంటే..

నీచుడు.. బుర్కా ధరించి ఏం చేశాడంటే..
X

ఓ యువకుడు బుర్కా ధరించి పాడు పనిచేశాడు. అమ్మాయిల బాత్ రూంలోకి ప్రవేశించి సెల్ ఫోన్ తో వీడియో రికార్డ్ చేశాడు. అతని చేష్టలు అనుమానం రావడంతో ప్రశ్నించగా.. అతగాడు మగాడని తేలింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. బుర్కా ధరించిన అభిమన్యు యువకుడు కొచ్చిలోని లులు మాల్ కు వెళ్లాడు. అక్కడ మహిళల బాత్ రూంలోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. తన సెల్ ఫోన్ లో వీడియో తీసి బయటికొచ్చాడు. తర్వాత బాత్ రూం డోర్ దగ్గర నిల్చొని పిచ్చి వేశాలు వేశాడు. అతని చేష్టలు అనుమానం వచ్చి మాల్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దాంతో అసలు విషయం బయటికి రావడంతో పోలీసులను పిలిపించి అప్పగించారు.

నిందితుడి నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారించగా.. అతను ఇన్ఫోపార్క్ లోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 354 (సీ), 419, 66 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరు పరుచగా.. ఆ వ్యక్తికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతేకాకుండా నిందితుడు గతంలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో విచారిస్తున్నారు.

Updated : 18 Aug 2023 5:48 PM IST
Tags:    
Next Story
Share it
Top