Home > క్రైమ్ > యువకుడు, వితంతువు వివాహేతర సంబంధం... తాళ్లతో కట్టి ఊరేగించారు

యువకుడు, వితంతువు వివాహేతర సంబంధం... తాళ్లతో కట్టి ఊరేగించారు

యువకుడు, వితంతువు వివాహేతర సంబంధం... తాళ్లతో కట్టి ఊరేగించారు
X

వివాహేతరం సంబంధం నేటి రోజుల్లో పరిపాటిగా మారింది. వివిధ కారణాలతో స్త్రీ, పురుషులు అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఈ సంబధాలతో కొన్ని సార్లు ఊహించన పరిణామాలు ఎదురవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను గ్రామస్తులు చితకబాదారు. తాళ్లతో కట్టి ఊరిలో ఊరేగించారు. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనుగుల్‌ జిల్లా తాల్చేరు సమితి ఖండాలో పంచాయతీ పరిధిలో ఉన్న ఓ మహిళ పెళ్లైన కొన్ని రోజులకే భర్తను కోల్పోయింది. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తు అత్తామామలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడంది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అతడు ఆమె ఇంటికి రాత్రి పూట వెళ్లిరావడం జరుగుతోంది. అత్తమామలను వారు పట్టించుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారికి బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నారు.

రోజులాగే బుధవారం రాత్రి ఆ యువకుడు గ్రామానికి వచ్చి..ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన పలువురు.. బయట గొళ్లెం పెట్టారు. గురువారం ఉదయం వారు తలుపులు తెరిచి ఇరువురిని తాళ్లతో కట్టి..కొడుతూ గ్రామంలో ఊరేగించారు.తర్వాత విద్యుత్తు స్తంభానికి కట్టేశారు. ఇరువురి కుటుంబాలు, గ్రామ పెద్దల చర్చలు అనంతరం విడిచిపెట్టారు.వారిని కొడుతూ ఊరేగిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.


Updated : 16 Jun 2023 6:03 PM IST
Tags:    
Next Story
Share it
Top