రైల్వే ప్లాట్‌ఫాంపై ఇన్‌స్టా రీల్స్..యువకుడి అరెస్టు
X
సోషల్ మీడియాలో మోజులో యువత హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. లైక్‌లు, షేర్ల కోసం ఆరాటపడుతు తోటి వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ప్రమాదకర విన్యాసాలు చేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. తాజాగా ఓ యువకుడు రైల్వే స్టేషన్‌లో జిమ్నాస్టిక్స్ చేసి ఇబ్బందుల్లో పడ్డాడు.
బిహార్‌లోని మాన్‌పుర్ జంక్షన్‌లో యువకుడు రీల్స్ చేశాడు. నెటిజన్లతో పాటు అక్కడున్న వారిని ఆకర్షించేందుకు జిమ్నాస్ట్రిక్స్ తో అదరగొట్టాడు. ప్లాట్‌ఫాంపై జంప్‌లు వేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే, యువకుడి విచిత్ర వేషాలు పోలీసుల కంటపడడంతో వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. సంబంధిత వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
‘మాన్‌పుర్ జంక్షన్ స్టేషన్‌లోకి టికెట్ లేకుండా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ సృష్టించాడన్న ఆరోపణలపై అతడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తెగించేవారికి ఇదొక గుణపాఠంగా నిలుస్తుందని భావిస్తున్నాం’ అని పోలీస్ శాఖ ట్విట్టర్లో రాసుకొచ్చింది.