Home > భక్తి > అధిక శ్రావణంలో కూడా వ్రతాలు ఆచరించాలా..?

అధిక శ్రావణంలో కూడా వ్రతాలు ఆచరించాలా..?

అధిక శ్రావణంలో కూడా వ్రతాలు ఆచరించాలా..?
X

తెలుగు నెలలు అన్నింటిలోనూ శ్రేష్ఠమైనది శ్రావణ మాసం.‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాదిలో ఓ నెల వచ్చే శ్రావణ మాసం ఈసారి రెండుసార్లు వస్తున్నది. మొదటిది అధిక శ్రావణమాసం. రెండవది నిజ శ్రావ ణమాసం. ఈ రోజు అంటే జూలై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం. రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది

జ్యోతిష శాస్త్ర ప్రకారం కాలగణన సూర్య, చంద్రుల ఆధా రంగా జరుగుతుంది. సూర్యుణ్ణి ఆధారంగా తీసుకొని లెక్కకట్టే కాలమానాన్ని ‘సౌరమానం’ అనీ, చంద్రుణ్ణి ఆధారంగా తీసు కొనే సంవత్సర గణనాన్ని ‘చాంద్రమానం’ అనీ అంటారు.చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు. దీని ప్రకారం చాంద్రమానంలో ఏడాదికి 354 రోజులు. సౌరమా నంలో ఏడాదికి 365 రోజులు, 6 గంటలు వుంటాయి. అంటే సౌరమానానికీ, చాంద్రమానానికీ మధ్య ఏడాదిలో 11 రోజుల తేడా ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దాని నే ‘అధికమాసం’ అంటారు. అయితే అధిక మాసంలో నిజ శ్రావణ మాసంలా వ్రతాలు ఆచరించాల్సిన సంప్రదాయం లేదు. శుక్రవార పూజలు, మంగళగౌరీ వ్రతాలు అన్నీ నిజమాసంలోనే చేసుకోవాలి. నిత్య దేవతార్చన విశేషంగా చేసుకోవాలి. ధర్మ సింధువు ప్రకారం అధిక మాసంలో ఉపాకర్మ, ఉపనయనం, వివాహం, వాస్తుకర్మ, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, యజ్ఞం, సన్న్యాసాశ్రమ స్వీకారం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకరణం మొదలైన కార్యక్రమాలు చేయకూడదు.

అయితే ముహూర్తాలతో ప్రమేయం లేకుండా నిత్యం చేసే పూజలు యథావిధిగా కొనసాగించవచ్చు. అదే సమయంలో అధిక మాసంలో జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ సాధ్యమైనంత ఎక్కువగా చెయ్యాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. మరణ సంబంధమైన క్రతువులు (మాసికం, ఆబ్దికం మొదలైనవి) అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది.

Updated : 18 July 2023 8:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top