Home > భక్తి > తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ తేదీల్లో సర్వదర్శనం టోకెన్లు రద్దు

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ తేదీల్లో సర్వదర్శనం టోకెన్లు రద్దు

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ తేదీల్లో సర్వదర్శనం టోకెన్లు రద్దు
X

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అలర్ట్ ప్రకటించింది. ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్టు తిరుమల తిరుపతి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో తితిదే, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం 3.5 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు. వాహన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. వాహన సేవల ఎదుట ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని తెలిపారు.

రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో తెలిపారు. ఆ రోజు ప్రత్యేక దర్శనాలు (వీఐపీ బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సమావేశంలో భక్తుల కోసం కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్లు తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను తయారు చేయించాలని నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు విక్రయిస్తామని తెలిపారు. హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు ఒక అమూల్యమైన కానుక అన్నారు. వేదపాఠశాల్లో 51మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ. 34 వేల నుంచి రూ. 54 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.




Updated : 2 Feb 2024 9:28 PM IST
Tags:    
Next Story
Share it
Top