Home > భక్తి > ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
X

అమర్‎నాథ్ యాత్రపై కీలక ప్రకటన వెలువడింది. అమర్‎నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడంతో పాటు, ట్రాక్ పునరుద్దరణ పనుల నేపథ్యంలో ఆగస్టు 23 నుంచి రెండు మార్గాల నుంచి యాత్రను నిలివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ప్రారంభించే తేదిని ఇంకా వెల్లడించలేదు. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై ఆగస్టు 31న చాడీ ముబారక్ కార్యక్రమంతో ముగుస్తుంది. యాత్ర రెండు మార్గాల నుంచి ఏకకాలంలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 4.4 లక్షల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. యాత్ర ప్రారంభమయ్యాక కొన్ని రోజులుకు అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ అనంతరం ప్రారంభించాక..తాాజాగా మరోసారి నిలిపివేశారు.

మంచు మార్గాన్ని దాటుకుని అంత ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను చేరుకోవడం కష్టంతో కూడుకున్నది. ఇక్కడ మనకు ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినా యాత్రికులు తండోపతండాలుగా తరలివస్తారు. అమర్‌నాథ్‌ని దర్శించడం ద్వారా కాశీలోని శివలింగం కంటే 10 రెట్లు, ప్రయాగరాజు కంటే 100 రెట్లు, నైమిశారణ్యం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యఫలాలు లభిస్తాయి. బాబా బర్ఫాని సందర్శన 23 తీర్థయాత్రలను సందర్శించినంత పుణ్యాన్ని పొందుతామని భక్తుల నమ్మకం


Updated : 20 Aug 2023 5:13 PM IST
Tags:    
Next Story
Share it
Top