తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అపశ్రుతి
Mic Tv Desk | 1 Jun 2023 8:05 PM IST
X
X
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఉన్న రావిచెట్టు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడు కడపకు చెందిన డా.గుర్రప్పగా గుర్తించారు. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కుమార్తెను చూసేందుకు వచ్చి...
మృతుడు గుర్పప్ప..గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నారు. స్విమ్స్‌లో మెడిసన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఆయన గురువారం వచ్చారు. అనంతరం గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రి మృతదేహం దేహం కుమార్తె రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి.
Updated : 1 Jun 2023 8:05 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire