Home > భక్తి > మసీదుకు వెళ్లి ప్రశంసలు కురిపించిన చిలుకూరు బాలాజీ అర్చకుడు

మసీదుకు వెళ్లి ప్రశంసలు కురిపించిన చిలుకూరు బాలాజీ అర్చకుడు

మసీదుకు వెళ్లి ప్రశంసలు కురిపించిన చిలుకూరు బాలాజీ అర్చకుడు
X

వీసాల దేవుడిగానే కాదు, భక్తుల కోరికలు తీర్చే చల్లని దేవుడిగానూ పేరుగాంచాడు చిలూకూరు బాలాజీ. ఆ ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేస్తున్న సీఎస్ రంగరాజన్ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆయన శుక్రవారం ఓ మసీదుకు వెళ్లి అక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. లంగర్ హౌస్ నేతాజీ నగర్‌లోని మసీదులో కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికి వరకు వందమంది పేషంట్లకు 5వేల డయాలసిస్‌లు చేశారు. ఈ సేవల విలువ రూ. 1.5 కోట్లు. కులమతాల భేదం లేకుండా పేదలకు, సామాన్యులకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందిస్తున్నారు. డయాలసిస్ సేవలను పరిశీలించిన రంగరాజన్ మసీదు నిర్వాహకులను కొనియాడారు. ‘పరస్పర ప్రేమ, గౌరవాలను పాదుకొల్పడానికి ఇలాంటి మానవీయ సేవలు దోహదపడతాయి’’ అని అన్నారు.


Updated : 11 Aug 2023 6:16 PM IST
Tags:    
Next Story
Share it
Top