Home > భక్తి > Medaram: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి

Medaram: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి

Medaram: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ‘ఆన్‌లైన్‌’ మొక్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి
X

అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్ లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారాన్ని ఆన్ లైన్ ద్వారా సమర్పించారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్ లైన్ ద్వారా సమర్పించారు.

కాగా, మేడారం జాతర ఆన్​లైన్, ఆఫ్​లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. భక్తులు వారి బరువుకి 1 కేజీకి రూ.60 చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. నిలువెత్తు బంగారం సమర్పించేందుకు ఓ వ్యక్తి 50 కేజీలు ఉంటే.. బరువు ప్రకారం రూ.3000, మీ సేవ చార్జీలు రూ.35, పోస్టల్ చార్జీలు రూ.100 కలిసి మొత్తంగా రూ.3,135 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.




Updated : 9 Feb 2024 11:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top