Home > భక్తి > దీపావళి పండుగపై అయోమయం... పండితులు ఏమంటున్నారంటే..

దీపావళి పండుగపై అయోమయం... పండితులు ఏమంటున్నారంటే..

దీపావళి పండుగపై అయోమయం... పండితులు ఏమంటున్నారంటే..
X

దీపావళి పండుగకు భారతదేశంలో ఎంతో విశిష్టత ఉంది. మతసామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మహిళలైతే దీపాలతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. చాలామంది ఈ పండుగ వేళ లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగ రోజు లక్ష్మిదేవిని పూజిస్తే మంచి జరుగుతుందనేది ప్రజల నమ్మకం..

దీపావళి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి దీపావళి నవంబర్ 12, 13న అమావాస్య వస్తుంది. దీంతో జనాల్లో పండుగ ఏ రోజు జరుపుకోవాలోనని సందిగ్ధత నెలకొంది. తాజాగా, దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 12న మధ్యాహ్నం నుంచి అమావాస్య మొదలై.. 13 సోమవారం మధ్యాహ్నం వరకు ముగుస్తుంది.

అయితే దీపావళి రాత్రి సమయాల్లో జరుపుకునేది కాబట్టి 12 తేదీన చేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. కొందరు మాత్రం అమావాస్య సూర్యోదయం మొదలయ్యే 13వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా 13వ తేదీన పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మూడు రోజులు సెలవులు వచ్చాయి. 11 రెండో శనివారం, 12న ఆదివారం, 13న దీపావళి కావడంతో వరుసగా మూడు రోజులు పాఠశాలలు, కాలేజీలు బంద్ కానున్నాయి.




Updated : 7 Nov 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top