Zodiac signs : శుక్రుడు కలయికతో ఈ రాశుల వారికి ధనశక్తి యోగం
X
(Dhanashakti Yoga) గ్రహాల కలయిక అనేది ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి. వాటివల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడుతాయి. కాబట్టి గ్రహాల కదలిక ఆధారంగా కొందరికి మంచి జరగొచ్చు. మరికొందరి జీవితంలో మార్పులు ఏర్పడవచ్చు. ఇక ఈ వారం కుజుడు(అంగారకుడు) సంచారం వల్ల కొన్ని రాశులవారికి ధనశక్తి యోగం కలగనుంది. మరి ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశివారికి రాజయోగం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. ఊహించనవిధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ రాశివారికి ఇక మంచి రోజులు ప్రారంభం అయినట్లే. సమాజంలో వీరికి ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కోరుకున్నవారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట ప్రత్యేక గౌరవ మర్యాదలు ఏర్పడుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి ధనశక్తి రాజయోగం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో చికాకులు దూరం అవుతాయి.
మిధున రాశి
ఈ రాశివారికి ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడి ప్రభావంతో ఆదాయం భారీగా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆఫీసుల్లో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం, సంతోషం కలుగుతుంది.
కర్కాటక రాశి
ధనశక్తి రాజయోగం వల్ల ఈ రాశివారు ప్రతి రంగంలోనూ మంచి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు దూరం అవుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది ధన లాభాలను పొందుతారు. ఇక ఈ రాశివారికి డబ్బుకు ఏ లోటూ ఉండదు.
మకర రాశి
ఈ రాశివారికి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి.
ధనశక్తి యోగం వల్ల ఈ రాశి వారికి ఆదాయం బాగా సమకూరుతుంది. అప్పుల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు.