Home > భక్తి > తెలంగాణలో దీపావళి సెలవు మార్పు.. 3 రోజులపాటు సెలవులు

తెలంగాణలో దీపావళి సెలవు మార్పు.. 3 రోజులపాటు సెలవులు

తెలంగాణలో దీపావళి సెలవు మార్పు.. 3 రోజులపాటు సెలవులు
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగకు సంబంధించి ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు రెండో శనివారం (నవంబర్‌ 11) ఆదివారం (నవంబర్‌ 12), సోమ‌వారం (నవంబర్‌ 13) వ‌రుసగా 3 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు అత్యంత ఘ‌నంగా జరుపుకుంటారు. దీపావళి అంటే.. ఎక్క‌వ‌గా పిల్ల‌ల‌కు చాలా ఇష్ట‌మైన పండుగ. ఎందుకుంటే.. పిల్లలు పెద్ద‌లు.. అంద‌రు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటారు. దీపావళి పండుగకు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ నవంబర్‌ 12వ తేదీనే జరుపుకోవాలని పంచాగకర్తలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా సోమవారం కూడా సెలవు ప్రకటించడంతో స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో పాటు.. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ మూడు రోజులు సంతోషంగా గడిపేందుకు ప్లాన్లు వేస్తున్నారు.




Updated : 10 Nov 2023 7:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top