Home > భక్తి > తిరుమల అడవుల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా?

తిరుమల అడవుల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా?

తిరుమల అడవుల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా?
X

దేశంలో ఉన్న అతిపెద్ద అడవుల్లో శేషాచలం కొండలు మూడో స్థానంలో ఉన్నాయి. సుమారు 8 వేల చ.కి.మీ.ల విస్తీర్ణంలో శేషాచలం కొండలు విస్తరించాయి ఏడుకొండలుగా పిలిచే గరుడాద్రి, శేషాద్రి, వృషబాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి కొండలు ఈ శేషాచలం హిల్స్‎లో భాగమే. ఈ ఏడు కొండలపైనే తిరుమల శ్రీవారు కొలువుదీరారు. ప్రపంచంలోనే అరుదైన జీవజంతువులు, వృక్ష సంపద ఉండటంతో శేషాచల కొండలు ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. వన్యమృగాలకు ఈ కొండలు ఆవాసంగా ఉన్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరించే వీడియోలు సోషల్ మీడియాలో అనేక సార్లు చూసే ఉంటారు. అయితే గత కొంత కాలంగా చిరుతలు శ్రీవారి భక్తులపై దాడులు చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

నెల రోజుల క్రితం కౌశిక్ అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన మరువకముందే , పది రోజుల క్రితం లక్షిత అనే బాలిక చిరుత దాడిలో చనిపోయింది. ఈ రెండు ఘటనలతో శేషాచలం అడవుల్లో వన్యమృగాల సంచారంపై ఆందోళన నెలకొంది. లక్షితపై చిరుత దాడి అనంతరం కాలినడకన వెళ్లే మార్గాల్లో 320 కిలోమీటర్లకు పైగా ట్రాప్ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కెమెరాలతో పాటు 36 బోన్లును అమర్చారు. 50 రోజుల వ్యవధిలోనే 3 చిరుతలు బోన్లలో చిక్కాయి. ట్రాప్ కెమెరాల్లో మరో మూడు చిరుతల ఉన్నట్లు టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. కొండ మీద చిరుతలే కాదు ఈ మధ్య ఎలుగుబంట్లు కూడా సంచరిస్తున్నాయి. భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో కనిపిస్తూ కలవర పెడుతున్నాయి.

అయితే శేషాచలం కొండల్లో మొత్తం ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయనేదానిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఫారెస్ట్ ఆఫీసర్ల లెక్కర ప్రకారం 2016లో 36 చిరుతలు, 3 ఎలుగుబంట్లు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం చిరుతల సంఖ్య 50 దాటిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సుమారు 8 ఎలుగుబంట్లు ఉన్నట్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అంచనా వేస్తోంది. దీంతో భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. అభయారణ్య చట్టం ప్రకారం వన్యమృగాలను అరికట్టడం సాధ్యం కాదు. టీటీడీ, ఫారెస్ట్ అధికారులు చేయగలిగిందల్లా వన్యప్రాణులను పరిరక్షిస్తూ, భక్తులకు రక్షణ కల్పించడమే అని తెలుస్తోంది. మరోసారి కొండ మీద ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Do you know how many leopards and bears are there in Tirumala forests?

more than 50 cheetahs, 8 bears, seshachalam hills, forest officials, cheetah attacks, TTD, Tirumala Tirupati Devasthanam, tirupathi, sri venkateswara,alipiri, srivari mettu, Garudadri, Seshadri, Vrushadri, Niladri, Anjanadri, Venkatadri, Narayanadri, devotees, forest department, AP news, Andhra Pradesh, Bears,

Updated : 18 Aug 2023 6:41 PM IST
Tags:    
Next Story
Share it
Top