Home > భక్తి > Medaram : బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి.. ఎక్సైజ్ శాఖ ఆదేశం

Medaram : బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి.. ఎక్సైజ్ శాఖ ఆదేశం

Medaram : బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి.. ఎక్సైజ్ శాఖ ఆదేశం
X

(Medaram) తెలంగాణ కుంభమేళా.. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే మేడారం జాతరకు భక్తులు ఇప్పటి నుంచి పోటెత్తారు. గద్దెలపై అమ్మవార్లను దర్శించుకొని పునీతులవుతున్నారు. మహాజాతర దగ్గర పడుతుండడంతో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి. వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం చుట్టూ ప్రక్కన ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. దీంతో భక్తులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.





మేడారం జాతర అంటే ముందుగా గుర్తొచ్చేది అమ్మలకు నిలువెత్త బంగారం సమర్పించడమే. కోరిన కోరికలు తీరితే.. భక్తి శ్రద్ధలతో వచ్చి వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారంలో ఎత్తు బంగారాన్ని కొనుగోలు చేసే భక్తుల వివరాలు సేకరించాలని, ఆ వివరాలన్నీ మళ్లీ తమకు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తుల నుంచి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నంబర్ వంటి వివరాలు తీసుకుని బంగారాన్ని అమ్మాలని ఆదేశించింది. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. ఏటూరునాగారం ప్రాంతంలో గుడుంబా తయారీ జోరుగా సాగుతుంది. అయితే మేడారం సమయంలో అధిక మొత్తంలో బెల్లం కొనుగోలు చేసి.. బయట అమ్ముకుంటున్నారు. దాంతో గుడుంబా తయారుచేస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.







Updated : 4 Feb 2024 1:43 PM IST
Tags:    
Next Story
Share it
Top