Home > భక్తి > వైభవంగా తిరుమల శ్రీవారి గరుడ సేవ

వైభవంగా తిరుమల శ్రీవారి గరుడ సేవ

వైభవంగా తిరుమల శ్రీవారి గరుడ సేవ
X

తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు కన్నుల పండుగగా తిరు వీధుల్లో గరుడోత్సవం జరిగింది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీవారి దివ్య రూపాన్ని కన్నులారా చూసేందుకు భక్తులు తిరు వీధుల్లో బారులుతీరారు. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మారుమోగిపోయింది. గరుడసేవలో భాగంగా శ్రీవారికి , శ్రీదేవి, భూదేవిలకు మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను అలంకరించారు. సంవత్సరం మొత్తంలో ఈ గరుడోత్సవం రోజునే స్వర్ణాభరణాలను గర్భగుడి నుంచి బయటకు వస్తాయి. ఇదిలా ఉంటే శ్రీవారి దర్శననార్థం ఇవాళ గ్యాలరీలలో రెండు లక్షల మంది భక్తులు వేచి ఉన్నట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడుతున్నారు.

Updated : 22 Sept 2023 9:15 PM IST
Tags:    
Next Story
Share it
Top