Home > భక్తి > Vinayaka Chavithi 2023 : గణేశ్ చవితి రోజు చేయకూడని పనులివే..

Vinayaka Chavithi 2023 : గణేశ్ చవితి రోజు చేయకూడని పనులివే..

Vinayaka Chavithi 2023 : గణేశ్ చవితి రోజు చేయకూడని పనులివే..
X

భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్దశి రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటారు. ఆ రోజున గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 18న జరుపుకోనున్నారు. సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. ఇంతకీ వినాయక చవితి పండగ రోజు ఏం పనులు చేయాలి. ఏం చేయకూడదు.

ఏం చేయాలంటే

చవితి రోజున ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకునే వారు ఆ రోజు సూర్యోదయానికి కన్నా ముందుగా నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. అనంతరం వినాయకుడిని ప్రతిష్ఠించి పూజా సమయం వరకు గణేశుడి ముఖం కనిపించకుండా ఎర్రని వస్త్రం కప్పి ఉంచాలి. స్వామివారి తొండం ఎడమవైపు ఉండే విగ్రహాన్ని తీసుకోవడం ఉత్తమం. పూజా మొదలు పెట్టే ముందు గంగాజలంతో స్వామివారి విగ్రహాన్ని తుడిచి నుదుటిపై సింధూరం పెట్టాలి. గణేశుడికి బంతి పూలు సమర్పించి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములను నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడి విగ్రహాన్ని 3, 5, 7, 9, 11 రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని పూజ చేసి నిమజ్జనం చేయాలి.

చేయకూడని పనులు

గణపతి విగ్రహాన్ని కొనేటప్పుడు పగుళ్లు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. విరిగిన విగ్రహాలు పూజకు పనికిరావు.

ఇంట్లో రెండు గణపతి విగ్రహాలను ప్రతిష్టించకూడదు.

వినాయక విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్యంలో ప్రతిష్టించి పూజ చేయాలి.

బాత్రూం గోడకు దగ్గరగా, మెయిన్ గేట్ ఎంట్రెన్స్ లో, ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో, హాల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టరాదు.

నాట్యమాడుతున్న వినాయక విగ్రహానికి పూజ చేయకూడదు.

గణేశుడికి వీపు కనిపించని విధంగా విగ్రహాన్ని కూర్చోబెట్టాలి.

నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి గణపతి పూజను చేయకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే మంచిది.

వినాయక పూజలో తులసీదళం ఉపయోగించకూడదు

వినాయక చవితి రోజున ఎవరిపై కోప్పడకూడదు. ఎవరిని దూషించరాదు.

గణేష్ చతుర్థి ఉపవాసం చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి. పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

వినాయక చతుర్థి రోజున ఎలుకలను ఎలాంటి హానీ కలిగించకూడదు

ఇంట్లో విగ్రహం పెట్టుకున్న నేరుగా నిమజ్జనం చేయరాదు. పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించే చోటపెట్టి ఆ వినాయకుడితో పాటు చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయాలి.

నిమజ్జనం చేసే సమయంలో స్వామివారి అలంకరణలో ఉపయోగించే పుష్పాలు అన్నింటినీ కచ్చితంగా తొలగించాలి.

Updated : 16 Sep 2023 1:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top