Home > భక్తి > Ganesh chaturthi 2023: బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన పిండివంటలు ఇవే..

Ganesh chaturthi 2023: బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన పిండివంటలు ఇవే..

Ganesh chaturthi 2023: బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన పిండివంటలు ఇవే..
X

వినాయక చవితిని చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా సంతోషంగా జరుపుకుంటారు. నవరాత్రులు జరిగే వేడుక రకరకాల పిండి వంటలు చేసి స్వామికి నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా గణనాథుడికి ఏది ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్లు, జిల్లేడు కాయలు, పాలతాలికలు, బెల్లం కుడుములను వంటకాలు తప్పనిసరిగా చేస్తారు. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ ఉంటారు. మరి వినాయక చవితి నైవేద్యాల్లో ఎలాంటి వంటకాలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో చూద్దాం.

1. బెల్లం కుడుములు:

ఒక కప్పు పచ్చి శెనగపప్పు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు బియ్యం, చిటికెడు యాలకుల పొడి తీసుకోవాలి.

తయారీ విధానం : ముందుగా పచ్చిశెనగపప్పును ఉడికించాలి. ఆ తర్వాత అందులో బెల్లం తురుము, యాలకుల పొడి కలిపి బాగా రుబ్బు కోవాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో మరికొంత బెల్లం వేసి నీటితో కలిపి పెట్టుకోవాలి. దీన్ని పూరీలా తయారు చేసుకోవాలి. వెంటనే అంతకు ముందు ఉడికించి రుబ్బి పెట్టుకున్న శెనగపప్పు విశ్రమాన్ని లడ్డుల్లా చేసి మడత వేయాలి. దాని అంచుల చివరన అందమైన డిజైన్ వేసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. అంతే బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి.


2. పాయసం :

లీటర్ పాలు, ఒక కప్పు శనగపప్పు, రెండు కప్పుల కొబ్బరి పాలు, పావు కేజీ బొంబాయి రవ్వ, కొద్దిగా బెల్లం, టేబుల్ స్పూన్ నెయ్యి, బాదాం, కిస్‌మిస్, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

తయారీ విధానం : శనగపప్పు బాగా ఉడికించి పెట్టుకోవాలి. అంతలోపు డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లంలో కొద్దిగా నీరుపోసి కరిగించి పెట్టుకోవాలి. శనగపప్పు ముద్దలో బొంబాయి రవ్వ తర్వాత బెల్లం పాకం, కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడికించాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది.


3. కొబ్బరి వడలు :

పావు కిలో బియ్యం, ఒక కొబ్బరికాయ, పావు కిలో ఉల్లిపాయలు, నూనె, చిటికెడు వంట సోడా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు సిద్ధం చేసి పెట్టుకోవాలి.

తయారీ విధానం : బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలి. కొబ్బరి తరుమును సిద్ధం చేసుకొని రెండూ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి ముద్దను కూడా కలపాలి. ఆ తర్వాత వంటసోడా, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యిపై గిన్నెలో నూనె పోసుకొని బాగా వేడి అయిన తర్వాత పిండిని వడల్లా ఒత్తి కరకరలాడేలా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి కొబ్బరి వడలు రెడీ.


4. నువ్వుల లడ్డూలు :

పావుకిలో నువ్వులు, యాలకుల పొడి టేబుల్ స్పూన్, ముప్పావు కిలో బెల్లం తీసుకోవాలి.

తయారీ విధానం : నువ్వులను బంగారు గోధుమ రంగు వరకు వేయించుకోండి,ఆ తర్వాత బెల్లాన్ని నీటిలో మరిగించి పానకం తయారు చేసుకోవాలి. నువ్వులతో పానకాన్ని బాగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలపాలి. చేతులకు కాస్త నూనె రాసుకొరి వాటిని ఉండల్లా చేసుకోవాలి. అంతే చాలా సులువగా నవ్వుల లడ్డూలు తయారు చేసుకోవచ్చు. మూడు పదార్థాలతోనే నిమిషాల్లో దీన్ని చేసుకోవచ్చు.


5. చలిమిడి :

కిలో బియ్యం, ముప్పావు కిలో బెల్లం, 50 గ్రాముల నెయ్యి, 50 గ్రాముల గసగసాలు, ఒక కొబ్బరి కాయ, నాలుగు బాదం రెబ్బలు.

తయారీ విధానం : బియ్యాన్ని బాగా కడికి రెండు రోజుల పాటు నానబెట్టుకోవాలి. ప్రతి రోజు అందులోని నీటిని వడపోసి కొత్త నీటిని చేర్చాలి. దీన్ని బాగా రుబ్బు కోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు, గసగసాలను చిన్నగా తరిగి వాటిని నెయ్యిలో వేయించుకోవాలి. బెల్లం పానక కూడా ముందుగానే తయారు చేసుకోవాలి. బియ్యం పిండిని మెల్లగా గరిటెతో తిప్పుతూ ఉండలు కట్టకుండా పానకంలో కలుపుతూ ఉండాలి. అంతా కలిశాక గసగసాలు, కొబ్బరి ముక్కలు వేస్తే నోరూరించే చలిమిడి తయారు అవుతుంది.


Updated : 17 Sep 2023 5:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top