Home > భక్తి > శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌
X

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. కర్నూలు జిల్లాలో ఉండే ఈ శైవక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. వీకెండ్‌లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి సుమారు 4-5 గంటల్లో చేరుకోవచ్చు. దీంతో నగరం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది.

తాజాగా శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా జూలై 22 నుంచి సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులు పరుగులు తీయనున్నాయి. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. కేవలం శని,ఆది వారల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.

తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం ముగిసిన వెంటనే.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారిని దర్శించుకుంటారు.శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.

రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ చేసి హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శనకు తీసుకెళ్తారు.. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుములు మాత్రమే ప్యాకేజీలో చేర్చారు. మిగతా ఖర్చులను ప్రయాణికులు భరించుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తిగ భక్లు టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.in లోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు . శ్రీశైలం టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి" అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు.

Updated : 19 July 2023 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top