Home > భక్తి > పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు.. ఇవి దాటితే మళ్లీ ఆగస్టులోనే

పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు.. ఇవి దాటితే మళ్లీ ఆగస్టులోనే

పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు.. ఇవి దాటితే మళ్లీ ఆగస్టులోనే
X

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో (ఫిబ్రవరి 11) నుంచి మాఘమాసం ప్రారంభం కానుండటంతో.. పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు, పంచాంగకర్తలు తెలిపారు. దీంతో దేశంలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఇప్పటి ఫంక్షన్ హాళ్లన్నీ ప్రీబుక్ అయిపోయాయి. వరుసగా ముహూర్తాలు ఉండటంతో.. అన్ని వస్తువులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వేలల్లో కొత్తం జంటలు ఒకటి కానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుంది. మార్చి 4వ తేదీ నుంచి ఫాల్గుణ మాసం, ఏప్రిల్ లో చైత్ర మాసం ప్రారంభం కానుంది.

2024, ఫిబ్రవరి నెలలో: 13, 14, 17, 18, 24, 28, 29వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.

2024, మార్చి నెలలో: 2, 3, 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.

2024, ఏప్రిల్ నెలలో: 3, 4, 9, 18, 19, 20, 21, 22, 24, 26వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.

ఏప్రిల్ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభం కానుండటంతో.. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఆగస్టులోనే మంచి ముహూర్తాలున్నాయని పండితులు, పంచాంగకర్తలు తెలిపారు.




Updated : 8 Feb 2024 5:35 PM IST
Tags:    
Next Story
Share it
Top