Richest Ganesh: రిచెస్ట్ వినాయకుడు.. కేవలం మండపానికే రూ.360 కోట్ల బీమా
X
దేశంలో ఎన్ని పండలున్నా గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దేశమంతా ఏకమై అట్టహాసంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రతీ వీధిలో విగ్రహాలు పెట్టి 10 రోజుల వేడుక చేసుకుంటారు. వినాయక చవితికి ఒక్కో ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక చోట ఎత్తైన విగ్రహాలు పెడితే.. భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తారు. మరోచోట ఖరీదైన (అలంకరణ) విగ్రహాలు నిలబెడతారు. ఈ క్రమంలో ముంబైలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ పెట్టిన వినాయకుడు ఈసారి వార్తల్లో నిలిచింది. వీళ్లు పెట్టిన మహా గణపతికి ఏకంగా 66.5 కిలోల బంగారం, 295 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, విలువైన వస్తువులతో అలంకరించారు. అంతేకాకుండా ఆ వినాయకుడు పెట్టిన మండపానికి రికార్డ్ స్థాయిలో రూ.360.40 కోట్ల బీమా చేయించారు. దీంతో ఈ వార్త దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది.
జీఎస్‌బీ సేవామండల్ నిర్వాహకులు ఈ ఏడాది 69వ వార్షకోత్సవం నిర్వహిస్తున్నారు. అందువల్లే ఈ భారీ గణేషుడిని ఏర్పాటు చేశారు. ఈ మండపానికి రావాలంటే మొదట ఫేషియల్ రికగ్రిషన్ చేయాలి. చుట్టూ సీసీ టీవీ పర్యవేక్షణ ఉంటుంది. ఇది ప్రతీ భక్తులు, నిర్వాహకులకు వర్తిస్తుంది. అంతేకాకుండా భక్తుల సౌలభ్యం కొరకు క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఉన్నందున ఈ వినాయక మండపంలో హోమం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. గతేడాది కూడా ఇదే వినాయక మండపానికి రూ.316 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించిన విషయం తెలిసిందే.