Home > భక్తి > MahaShivaratri : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..భక్తులతో శ్రీశైలం కిటకిట

MahaShivaratri : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..భక్తులతో శ్రీశైలం కిటకిట

MahaShivaratri : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..భక్తులతో శ్రీశైలం కిటకిట
X

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు హంస వాహనంపై స్వామివారు కనిపించారు. భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంస వాహనంపై ఊరేగారు. ఆలయంలో రాత్రి వరకూ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తి పీఠంగా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలం మహాక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

త్రిశూలధారియైన స్వామివారు హంస వాహనంపై విహరించారు. రాజగోపురం నుంచి స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాజాబజంత్రీల నడుమ బ్యాండు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, నందికోల సేవ, ఢమరుకం, చిడతలు, చెక్కబొమ్మల విన్యాసాల నడుమ ఊరేగింపు సందడిగా సాగింది.

బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మయూరవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శివరాత్రి రానున్న తరుణంలో శ్రీశైలం ఆలయానికి శివస్వాములు పోటెత్తారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Updated : 4 March 2024 12:21 PM IST
Tags:    
Next Story
Share it
Top