Home > భక్తి > ఈ రావణాసురుడి ధర రూ. 20 లక్షలు..

ఈ రావణాసురుడి ధర రూ. 20 లక్షలు..

ఈ రావణాసురుడి ధర రూ. 20 లక్షలు..
X

దసరా పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు. బెంగాలీయులు దుర్గమ్మను ప్రధానంగా కొలిస్తే, ఉత్తరాది రాష్ట్రాల్లో రావణాసుర దహనంతో పండగ చేసుకుంటారు. పురాణ కథలు ఏవైనాసరే చెడుపై మంచి సాధించిన విజయానికి దశహరా ప్రతీక. ఉత్తరాదిలో దసరా సందర్భంగా రావణాసురుడి పెద్దపెద్ద దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అయినా పండగపూట ‘తగ్గేదే’ లేదంటూ రికార్డుల బద్దలు కొడుతుంటారు.

హరియాణాలోని పంచ్‌కుల్లాలోని ఓ వేడుక ఈ దసరాలో రికార్డు సృష్టించనుంది. శాలిమార్ గార్డెన్ ప్రాంతంలో 171 అడుగుల ఎత్తయిన రావణాసురుడి బొమ్మను ఏర్పాటు చేశారు. దీన్ని పండగ రోజున కాల్చేయనున్నారు. ఈ బొమ్మ ఏర్పాటుకు రూ. 20లకు పైగా ఖర్చు చేశారు. శ్రీమాతా మన్సాదేవి ట్రస్ట్, ఆదర్శ్ రమిల్లాలు సంయుక్తంగా రిమోట్ కంట్రోల్ ద్వరా ఈ దహనాన్ని చేపట్టున్నాయి. దసరా వేడుకల చరిత్రలో ఇదే రెండో అత్యంత ఎత్తయిన బొమ్మ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బొమ్మ తయారీ కోసం 25 క్వింటాళ్ల ఇనుము, 3వేల మీటర్ల వస్త్రాని, చాపలను క్వింటాల్ ఫైబర్ వాడారు. పర్యావరణానికి హాని కలిగించని రీతితో దీని కోసం ప్రత్యేకంగా మందుగుండును తమిళనాడులో తయారు చేయించారు. 2019లో హరియాణాలోనే 220 అడుగుల ఎత్తయిన లంకేయుడి బొమ్మను తగలబెట్టారు. అంబాలకు చెందిన తేజేంద్రసింగ్ రాణా అనే వ్యాపారి దీన్ని చండీగఢ్లో ధనాస్ గ్రామంలో ఏర్పాటు చేశాడు. అత్యంత ఎత్తయిన రావణాసురుడి రికార్డు ఈ బొమ్మదే.


Updated : 22 Oct 2023 4:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top