Home > భక్తి > Medaram : మేడారానికి పోటెత్తిన భక్తులు...రోడ్లపై బారులు తీరిన జనం

Medaram : మేడారానికి పోటెత్తిన భక్తులు...రోడ్లపై బారులు తీరిన జనం

Medaram  : మేడారానికి పోటెత్తిన భక్తులు...రోడ్లపై బారులు తీరిన జనం
X

(Medaram) ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరకు రంగం సిద్దమైంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై అమ్మవార్లను దర్శించుకొని పునీతులవుతున్నారు. మహాజాతర దగ్గర పడుతుండడంతో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.





వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం చుట్టూ ప్రక్కన ప్రాంతాలన్నీ రద్దీగా మారి ట్రాఫిక్ బాగా పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేస్తున్నారు. మహాజాతరకు ఇంకా సమయమున్నా..భక్తులు ముందే వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. సెలవు రోజు కావడంతో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా అన్ని ఏర్పాటు పూర్తి చేశామని ఆలయ అధికారులు చెప్పారు.





అమ్మవార్ల దర్శనం అనంతరం వనదేవతలకు కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల పరిసరాలు, చిలుకలగుట్ట, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లో విడిది చేసి వంటలు చేసుకుని వనభోజనాలు చేస్తున్నారు. జాతర పరిసరాల్లోని పలు దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపిస్తున్నాయి. చిరుదుకాణాల వద్ద సందడి నెలకొంటున్నది. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తునారు.




Updated : 4 Feb 2024 1:01 PM IST
Tags:    
Next Story
Share it
Top