Home > భక్తి > మసీదును ప్రారంభించి హిందూ మఠాధిపతి.. సామరస్యానికి ఇదే రుజువు

మసీదును ప్రారంభించి హిందూ మఠాధిపతి.. సామరస్యానికి ఇదే రుజువు

మసీదును ప్రారంభించి హిందూ మఠాధిపతి.. సామరస్యానికి ఇదే రుజువు
X

కులమతాల పేర్లలో నిత్యం ఒక్కడో ఒకచోట హింస సాగే ఈ దేశంలో అక్కడక్కడా సుహృద్భావ వాతావరణం కూడా ఉంది. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా అందరం మనుషులమేనని, కలసిమెలసి జీవించడమే మానవధర్మమని చెప్పే అరుదైన సంఘటనలకు కూడా కొదవ లేదు. కర్నాటకలో కొప్పళ్ జిల్లాలో ఓ మసీదు అలాంటి అద్భుతమై సామరస్యానికి వేదికైంది. కుకనూర్ తాలూకాలోని భనపూర్ గ్రామంలో నిర్మించిన మసీదును హిందూ మతగురువు శుక్రవారం ప్రారంభించారు. ముస్లింలు స్వయంగా వెళ్లి, మసీదు ప్రారంభించాలన్న విన్నపాన్ని ఆయన సంతోషంగా మన్నించారు.

గ్రామంలో అన్ని మతాలు ప్రజలు కలసి మెలసి ఉంటున్నారని, దీనికి ప్రతీకగా మసీదును ‘గావి’ మఠాధిపతి అభినవ గావిసిద్ధేశ్వరస్వామి చేతుల మీదుగా ప్రారంభించాలని ముస్లింలు నిర్ణయించారు. శుక్రవారం ఆయన మసీదుకు వెళ్లి ఇస్లాం సంప్రదాయాల ప్రకారం లాంఛనంగా మందిరాన్ని ప్రారంభించారు. అన్ని మతాలూ సమానమేనని, ఇతరులను బాధపెట్టకపోడమే అసలైన మతమని ఆయన అన్నారు. గుళ్లకు, మసీదులకు, చర్చిలకు వెళ్లే వారు మత్రమే భక్తులుకాదని, సాటి మనిషికి హాని తలపెట్టనివారూ దైవభక్తులేనని చెప్పారు. భన్‌పూర్ గ్రామలో ఐదు ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, ఎప్పుడూ ఎలాంటి గొడవలూ తలెత్తదని స్వామీజీ తెలిపారు.

Updated : 2 July 2023 10:13 PM IST
Tags:    
Next Story
Share it
Top