Home > భక్తి > నేడే నాగుల పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి

నేడే నాగుల పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి

నేడే నాగుల పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి
X

నాగుల పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాగుల చవితి సందర్భంగా నిన్న ఒక్కపొద్దులు ఉన్న మహిళలు, బాలికలు సోమవారం నాడు నాగుల పంచమి సందర్భంగా నాగదేవత ఆలయానికి వచ్చి ఉపవాస దీక్షలు విరమించారు. హిందూ సంప్రాదాయం ప్రకారం.. నాగుల పంచమి రోజున శివుడితో పాటు నాగదేవతను పూజించడం ఆనవాయిగా వస్తోంది. ఈ సంవత్సరం నాగుల పంచమి ఆగస్టు 21వ తేదిన వచ్చింది. అందులోనే పవిత్రమైనదిగా భావించే శ్రావణ సోమవారం నాడు నాగుల పంచమి రావడం మరింత ప్రత్యేకం.

అయితే నాగ పంచమి రోజున హిందువులు కొన్ని పనులు చేయకూడదు. అవి ఏంటంటే.. పాములకు హాని తలపెట్టకూడదు. వాటికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. సాధారణంగా పండుగ అంటేనే భక్తికి సంబంధించిన విషయం. పాములకు హాని తలపెట్టడం అనేది ఆధ్యాత్మిక భావానికి విరుద్ధంగా ఉంటుంది. దేవాలయాల్లో పాముల ప్రదర్శన చేయకూడదు. పుట్ట మీద పామును వదిలి.. ఆ పుట్ట చుట్టూ చేరి అగరవత్తులు, దీపాలు.. వెలిగించి, ఏకధారగా పాలు పోస్తే.. ఆ పాములు ఊపిరాడక చనిపోవడం ఖాయం. కాబట్టి అలాంటి పనులను మీరు అసలు ప్రోత్సహించకండి. ఎందుకంటే భూమిపై పాముల సంఖ్య తగ్గిపోతే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.

సంప్రదాయం ప్రకారం పుట్టకు పాలు సమర్పించడం ఒక స్థాయి వరకు మంచిదే కానీ.. అధిక మొత్తంలో పాలను ఉపయోగించడం అనవసరం. దీని వల్ల అటు పాములకు, ఇటు పాల అవసరమున్న జనాలకు ఇబ్బందేన్న సంగతి మరిచిపోకండి. మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో పాము కనబడితే.. వెంటనే భక్తితో దాని దగ్గరకు వెళ్లి పాముకు పాలు పోయడం, హారతులివ్వడం వంటి పనులు అసలు చేయకండి. ఎందుకంటే పాము కాటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాములకు దూరంగా ఉండడం మంచిది.





Updated : 21 Aug 2023 5:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top