rakshabhandan2023: కట్టిన రాఖీ ఎలా తొలగించాలి.. ఎక్కడ పడేయాలి..!
X
హిందూ ఆచారంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాధాన్యం ఇస్తారు. అన్నిటితో పాటు ఆ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని చెప్పబడింది. పౌర్ణమి నాడు రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పురాణాలు చెప్తున్నాయి. అలాగే పండగ అయిన తర్వాత చేతినుంచి రాఖీని ఎలా తొలగించాలి.. ఏఏ నియమాలు పాటించాలో తెలుసా...
భద్ర నీడ సమయంలో రాఖీ కట్టడం మంచిది కాదని పురాణాలు చెప్తున్నాయి. రావణుడి చెల్లెలు శూర్పణఖ కూడా భద్ర గడియల్లోనే రాఖీ కట్టింది. దానివల్లే రావణుడు యుద్ధంలో చనిపోయాడని అంటుంటారు. అందుకే ఏ సమయాల్లో రాఖీ కట్టాలని ఇప్పటికే చాలామంది చెప్పుంటారు. అయితే, రాఖీని ఎక్కువ రోజులు చేతికి ఉంచితే అపవిత్రం. మంచి రోజు చూసుకుని రాఖీ తొలగించాలని పురాణాలు చెప్తున్నాయి. చేయి నుంచి తొలగించిన రాఖీని ఎక్కడపడితే అక్కడ కాకుండా.. ఎర్రని వస్త్రంలో చుట్టి దేవుని మందిరంలో ఉంచాలి. ముఖ్యంగా తెగిపోయిన రాఖీ అస్సలు కట్టుకోకూడదు. అలాంటివి కట్టుకున్నా, చేతికి ఉంచుకున్నా సోదరులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తెగిపోయిన రాఖీలను ప్రవహించే నీటిలో వదలాలి. దగ్గర్లో నీళ్లు లేకుంటే రూపాయి నాణెంతో రాఖీని చెట్టు కింద ఉంచాలి.
రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు దిశలో, సోదరి ముఖం పడమర లేదా ఉత్తర దిశలో ఉండాలి. నలుపు రంగు రాఖీలు కట్టకూడదు. సోదరుడి భుజంపై కండువా తప్పకుండా ఉండాలి. నేలపై కాకుండా కుర్చీ లేదా బల్లపై కూర్చోవాలి. చాపపై కూర్చున్నా మేలు జరుగుతుంది. మంచంలో కూర్చొని రాఖీ కట్టించుకుంటూ అశుభం.