Home > భక్తి > రాఖీ పండగ ఎప్పుడు..30 తేదీనా 31 నా ?

రాఖీ పండగ ఎప్పుడు..30 తేదీనా 31 నా ?

రాఖీ పండగ ఎప్పుడు..30 తేదీనా 31 నా ?
X

భారతీయ పండగలలో రక్షాబంధన్‌ది ప్రత్యేక స్థానం. హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షా బంధన్ చంద్ర క్యాలెండర్ మాసం శ్రావణ చివరి రోజున వస్తుంది. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. శుభముహుర్తంలో సోదరులకు సోదరి రాఖీ కట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. కుల, మతాలకు అతీతంగా దేశంలో అన్ని ప్రాంతాల వారు ఈ పండగను జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న రక్షాబంధన్ ను ఈ ఏడాది ఎప్పుడు చేసుకోవాలన్నదానిపై గందరగోళం నెలకొంది.

రాఖీ పండగ 30 తేదీనా 31 నా...?

ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులలో రావడంతో రాఖీ పండగ 30నా, 31నా అనే సందేహాలు ఏర్పాడ్డాయి అయితే 30వతేదీన భద్రకాలం ఉంది. దీంతో సోదరులకు ఎప్పుడు సోదరీమణులు రాఖీ కట్టే శుభ ముహర్తంపై క్లారిటీ రావడం లేదు.

రాఖీ ఎప్పడు కట్టాలంటే..

పౌర్ణమి 30వ తేదీ రాత్రి 9.01 గంటలకు ప్రారంభమై 31వ తేదీ ఉదయం 07.05 నిమిషాల వరకు ఉంటుంది. సోదరీమణులు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. భద్రకాలంలో రాఖీ కట్టొద్దని పండితులు సూచిస్తున్నారు. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


Updated : 9 Aug 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top